మరోసారి పాయల్ పాప ‘పాయ్ పాయ్’!

RX 100 సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన బ్యూటీ పాయల్ రాజ్‌పూత్ ఆ తరువాత ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేస్తూ నటిస్తోంది. ప్రస్తుతం RDX లవ్ అనే మరో హాట్ కంటెంట్ సినిమాతో మనముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాలో అమ్మడి అందాలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక అటు తన నెక్ట్స్ మూవీ డిస్కో రాజాలో కూడా అందాల విందుతో పాయల్ రెచ్చగొట్టేందుకు సిద్దమయ్యింది.

కాగా ఈ క్రమంలో మరోసారి పాయ్ పాయ్ అనేందుకు రెడీ అవుతోంది పాయల్ రాజ్‌పూత్. అదేనండీ మరోసారి హాట్ ఐటెం సాంగ్‌ చేసేందుకు ఆర్డీఎక్స్ పాప రెడీ అయ్యింది. గతంలో తేజ డైరెక్ట్ చేసిన సీత సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్‌లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి అదే డైరెక్టర్ కోసం ఐటెం గర్ల్‌గా మారనుందట. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఏదేమైనా అటు సెలెక్టివ్ సినిమాలు చేస్తూ అందాల ఆరబోతతో రెచ్చగొడుతున్న పాయల్, హాట్ ఐటెం సాంగ్స్‌తోనూ తన అందాలను ప్రదర్శిస్తూ తెలుగు కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. మరి ఈ బ్యూటీ నటించిన ఆర్డీఎక్స్ లవ్ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Leave a comment