బన్నీతో దిగుతున్న నందమూరి హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అల వైకుంఠపురములో’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ టీజర్ ఇప్పటికే జనాల్లో చాలా ఆసక్తిని క్రియేట్ చేశాయి. కాగా ఈ చిత్ర టీజర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. కానీ బన్నీతో పాటు తాను కూడా దిగుతానంటున్నాడు నందమూరి హీరో.

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎంత మంచి వాడవురా’ కూడా షూటింగ్‌న శరవేగంగా జరుపుకుంటోంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర సినిమాకే హైలైట్ కానుందట. ఇక ఈ సినిమా టీజర్‌ను కూడా దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. దసరా సీజన్‌లో టీజర్ వదిలితే సినిమాకు మంచి క్రేజ్ లభిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఏదేమైనా టీజర్ విషయంలోనూ ఇద్దరు హీరోలు పోటీ పడుతుండటంతో ఆయా హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల టీజర్లు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటాయో చూడాలంటే దసరా పండగ వరకు ఆగాల్సిందే!

Leave a comment