సుధీర్ బాబుకు ఎందుకిన్ని కష్టాలు..

సుధీర్ బాబు…ఎప్పుడో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఎదుగుబొదుగు లేకుండా ఉన్న హీరో.. సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడిగా, మహేష్ బాబు బావగా సినిమాల్లోకి వచ్చిన సుధీర్ కష్టానికి తగినన్న హిట్లు లేవు. సినిమా సినిమాకు కష్టపడతాడు గానీ విజయాలు మాత్రం ఆమడ దూరంలో ఉంటాయి. గట్టిగా చెప్పుకోవాలంటే ప్రేమ కథాచిత్రం ఒకటే మంచి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మిగతా సినిమా లో కొన్ని ఓ మోస్తరుగా ఆడగా…. మిగతావి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

అయితే మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ….సినిమా కోసం సిక్స్ ప్యాక్ లు చేస్తూ కష్టపడే సుధీర్ బాలీవుడ్ లో భాగీ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా ఆశించినంత విజయం సాధించలేదు. విలన్ గా తన బాడీ తో ఆకట్టుకున్న ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఎప్పుడు కష్టపడే సుధీర్ తాజాగా నటిస్తున్న చిత్రం కోసం కూడా తెగ కష్టపడుతున్నాడు.

ఇంద్రకృష్ణ మోహనగంటి దర్శకత్వంలో నాని మరో హీరోగా సుధీర్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ‘వి’ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్న సుధీర్ ఓ రేంజ్ లో కష్టపడిపోతున్నాడు. మాములుగా ఏవైనా ఫిజికల్ ఎక్సర్ సైజులు చేసి బాడీ వర్కౌట్ చేయాల్సిన సుధీర్… రోడ్డు మీద ఉన్న ఓ కారుని ఒక్కడే నెడుతూ..కష్టపడుతున్నాడు. ఒక ట్రైనర్ మరి పక్కన ఉండి సుధీర్ చేత కారు నెట్టించాడు. తన వల్ల కాకపోయినా బలవంతంగా కారుని నెట్టాడు.

సుధీర్ కారుని నెడుతున్న వీడియోని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేయాస్ మీడియా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక ఇది చూసిన నెటిజన్లు సుధీర్ కి ఇన్ని కష్టాలు ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ‘వి’ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. మరి చివరికి ఈ కష్టానికి తగిన ప్రతిఫలం సుధీర్ కు లభిస్తుందో లేదో చూడాలి.

Leave a comment