నాని ‘ గ్యాంగ్ లీడ‌ర్ ‘ ప్రీమియ‌ర్ల క‌లెక్ష‌న్స్‌

నాని గ్యాంగ్ లీడర్ మూవీ నేడు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది అన్న కామెంట్లు వస్తున్నాయి. దర్శకుడు విక్రమ్ కుమార్ స్టోరీని చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పిన విధానం బాగుంది అని చెబుతున్నారు. ఇక సినిమాలో నాని నటనతో పాటు కామెడీ టైమింగ్ సన్నివేశాలు… సీరియస్ సన్నివేశాలు, ఎమోషన్స్… ఐదుగురు లేడీ గ్యాంగ్‌పై తీసిన స‌న్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ఇక యూఎస్‌లో కూడా గ్యాంగ్ లీడ‌ర్‌కు మంచి టాక్ వ‌చ్చింది. యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ పరంగా కూడా గ్యాంగ్ లీడర్ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా 177 లొకేషన్స్ నుండి $ 1,82,679 వసూళ్లు రాబట్టింది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వారంత సెలవులలో ఈ చిత్ర వసూళ్లు పెరిగే అవకాశం కలదు.

యూఎస్‌లో నానికి మంచి మార్కెట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ రికార్డు వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటించగా, సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య ఇతర కీలకపాత్రలలో నటించడం జరిగింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Leave a comment