పవన్ కళ్యాణ్‌పై నిర్మాతల ఒత్తిడి..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు అడుగులు వేశారు. జ‌న‌సేన పార్టీతో ఎన్నిక‌ల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు కొంద‌రు నిర్మాత‌ల నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల‌కు యేడాది ముందుగా ప‌వ‌న్ న‌టించిన అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు చేయ‌లేదు. ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది.

ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓట‌మితో ప‌వ‌న్ తిరిగి సినిమాలు చేసుకుంటాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఐదేళ్ల వ‌ర‌కు ఎన్నిక‌లు కూడా లేవు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌కు అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాత‌లు ఇప్పుడు త‌మ బ్యాన‌ర్లో సినిమాలు చేసి..ఆ క‌మిట్‌మెంట్లు కంప్లీట్ చేయాల‌ని ప్రెజ‌ర్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ప‌వ‌న్ మాత్రం తాను తిరిగి సినిమాల్లోకి వ‌చ్చే ప్ర‌శ‌క్తే లేదని… తాను ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌గానే ఉంటాన‌ని చెపుతున్నారు.

అయితే ప‌వ‌న్‌కు భారీగా అడ్వాన్స్‌లు ఇచ్చిన హరిక మరియు హాసిన్ క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, ఎ.ఎమ్.రత్నం, రామ్ తాల్లూరి పవన్ కళ్యాణ్ త‌మ‌కు సినిమాలు చేయాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా వేచి చూసిన నిర్మాత‌లు ప‌వ‌న్‌పై ఒత్తిడి తెస్తున్న‌ట్టు
విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప‌వ‌న్ మాట మీద నిల‌బ‌డుతూ తిరిగి సినిమాల్లోకి వ‌చ్చే స్కోప్ లేక‌పోతే అడ్వాన్స్‌లు ఇచ్చిన వాళ్లంతా ప‌వ‌న్‌పై డ‌బ్బుల కోసం మ‌రింత‌గా ఒత్తిడి చేస్తార‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ప‌వ‌న్ డెసిష‌న్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

Leave a comment