సైరాకి రాజమౌళి ఎడిటింగ్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి మూవీ అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేశారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 350 కోట్ల భారీ బడ్జెట్ తో రాం చరణ్ నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కూడా పని చేయడం జరిగింది.

రిలీజ్ దగ్గర పడుతుండటతో సినిమా ఎడిటింగ్ ఫైనల్ చేస్తున్నారట. సైరా ఎడిటింగ్ లో చిరు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అంతేకాదు దర్శకధీరుడు రాజమౌళి సైరా ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారట. బాహుబలి తర్వాత అంతటి భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా సైరా. సురేందర్ రెడ్డి టేకింగ్ బాగున్నా ఫైనల్ కట్ లో రాజమౌళి ఉంటే బెటర్ అని మెగాస్టార్ అలా ప్లాన్ చేశారు.

బాహుబలి సినిమాతో రాజమౌళి టాలెంట్ ఏంటో బాలీవుడ్ ఆడియెన్స్ కు తెలిసింది. అందుకే రాజమౌళి సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుందని చిరు అనుకున్నారట. ఫైనల్ ఎడిటింగ్ పూర్తయ్యాక జక్కన్నకు చూపించి తన అభిప్రాయాన్ని తీసుకోవాలని చూస్తున్నారట. సినిమా ఎవరిదైనా సినిమానే కాబట్టి రాజమౌళి కూడా సైరా సూపర్ హిట్ అయ్యే బాధ్యతను మీద వేసుకోనున్నాడు.

Leave a comment