Gossipsమెగా ఫ్యాన్స్‌ను భయపెడుతున్న డియర్ కామ్రేడ్

మెగా ఫ్యాన్స్‌ను భయపెడుతున్న డియర్ కామ్రేడ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా టీజర్‌ను ఆగష్టు 20న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల పేర్కొంది. కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా భయపెడుతోంది. ఇంతకీ డియర్ కామ్రేడ్‌కు సైరాతో లింకేంటి అనుకుంటున్నారా..?

ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అటు నిర్మాతలు కూడా ఈ సినిమాను ఏకంగా 4 భాషల్లో రిలీజ్ చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. కానీ వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఇప్పుడు ఇదే తరహాలో సైరా మూవీ కూడా 4 భాషల్లో రానుంది. ఈ చిత్ర లేటెస్ట్ టీజర్‌ను నలుగురు సెలెబ్రిటీల వాయిస్ ఓవర్లతో నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో పవన్, తమిళంలో రజినీకాంత్, మళయాలంలో మోహన్ లాల్ ఈ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

అయితే భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో ఇప్పుడు సైరా కూడా సేమ్ టు సేమ్ అలాంటి రిజల్ట్ రాబడుతుందా అని మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. కాగా ఆగష్టు 20న ఈ చిత్ర టీజర్‌ను చాలా సింపుల్‌గా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు భారీ స్థాయిలో జరగనున్నాయి. మరి ఈ చిత్ర టీజర్‌తో పాటు ఇంకో సర్‌ప్రైజ్ కూడా ప్లాన్ చేశారట సైరా టీమ్. మరి ఆ సర్‌ప్రైజ్ ఏమిటనేది తెలియాలంటే ఇంకొక రోజు ఆగాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news