” కౌసల్యా కృష్ణమూర్తి ” ట్రైలర్..!

ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో భీమనేని శ్రీనివాస్ డైరక్షన్ లో కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమా కౌసల్యా కృష్ణమూర్తి. కోలీవుడ్ సూపర్ హిట్టైన కణా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ లో నటిస్తుంది. తెలుగులో హీరోగా కార్తిక్ రాజు నటిస్తున్నాడు. వీరితో పాటుగా రాజేంద్ర ప్రసాద్, ఝాన్సి నటించారు. తమిళంలో గెస్ట్ రోల్ చేసిన శివ కార్తికేయన్ తెలుగులో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. కౌసల్యా కృష్ణమూర్తి ది క్రికెటర్ కథ విషయానికొస్తే ఓ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి క్రికెటర్ అవ్వాలనుకునే లక్ష్యాన్ని ఎలా సాధించింది ఆమెకు మధ్యలో ఎన్ని అవమానాలు.. కష్టాలు ఎదురయ్యానన్నది సినిమా కథ. ట్రైలర్ తో సినిమా కథ మొత్తం చెప్పేసిన భీమనేని శ్రీనివాస్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

తెలుగులో భారీ తారాగణంతో వస్తున్న కౌసల్యా కృష్ణమూర్తి తప్పకుండా ఐశ్వర్యా రాజేష్ కు మంచి ఫలితాన్ని ఇచ్చేలా ఉంది. ఈ సినిమా తర్వాత తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో బ్రేకప్ సినిమాలో నటిస్తుంది ఐశ్వర్యా రాజేష్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న కౌసల్యా కృష్ణమూర్తి ఎలా ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment