Gossipsతెలుగు డిస్ట్రిబ్యూష‌న్లో డేంజ‌ర్ గేమ్‌..

తెలుగు డిస్ట్రిబ్యూష‌న్లో డేంజ‌ర్ గేమ్‌..

ఓక‌ సినిమా వస్తుందంటే చాలు డిస్ట్రిబ్యూషన్ వర్గాల మధ్య భారీ పోటీ మొదలవుతుంది. అప్పటి వరకు చాలా స్నేహితులుగా ఉన్న వాళ్లు సైతం శత్రువులుగా మారిపోయి ఆ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు పెద్ద యుద్ధం చేస్తుంటారు. తెలుగు సినిమా రంగంలో పెద్ద పెద్ద సినిమాల హక్కులు దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీకి దిగితే డేంజర్ గేమ్ మొదలు పెట్టేస్తారు. ఇది రోజురోజుకు తీవ్రంగా పెరిగిపోతుండడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న‌ ఆందోళన అందరిలోనూ ఉంది.

తెలుగు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారంతా పైకి స్నేహంగా కనిపిస్తున్నా లోపల మాత్రం వారి మధ్య అంతర్గత వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అదే తరహాలో `సైరా` రిలీజ్ హక్కుల విషయంలో రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య వార్ నడుస్తోందని తెలుస్తోంది. సైరా లాంటి ప్రెస్టేజియ‌స్ మూవీ వ‌స్తుందంటే పంపిణీదారుల మ‌ధ్య పెద్ద పోటీ ఉంటుంది. ఒకరిని మించి ఒకరు ధరల్ని పెంచేస్తూ పోటీపడుతుంటారు. సైరా ఉత్త‌రాంధ్ర రైట్స్ విష‌యంలో న‌డుస్తోన్న వార్‌తో డిస్ట్రిబ్యూష‌న్ వ‌ర్గాలు సైతం షాక్‌లో ఉన్నాయి.

ముందుగా ఈ సినిమా ఉత్త‌రాంధ్ర రైట్స్ సీనియర్ ఎగ్జిబిటర్ క్రాంతి రెడ్డి దాదాపు 15 కోట్లతో విశాఖపట్నం టౌన్ సహా ఉత్తరాంధ్రకు సొంతం చేసుకున్నారు. ఈ రైట్స్ కోసం ముందు క్రాంతి రెడ్డి వ‌ర్సెస్ గాయ‌త్రి ఫిలింస్ మ‌ధ్య వార్ న‌డిచింది. రూ.13 కోట్ల భేరం కాస్తా రూ.15 కోట్ల‌కు వెళ్లింది. ఇంత‌లో రాజు ఎంట‌ర్ అయ్యి రూ.16 కోట్లు ఇస్తాన‌ని చెప్ప‌డంతో మ‌ళ్లీ వార్ స్టార్ట్ అయ్యింది. అవ‌స‌ర‌మైతే మ‌రో కోటి ఇచ్చి అయినా రాజు మెగాస్టార్ సినిమాను త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఇలా ఎవ‌రికి వారు రేట్లు పెంచుకుంటూ పోతుండ‌డంతో ఈ వార్‌పై ఆందోళ‌న నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news