పీకల్లోతు ప్రేమలో స్టార్ హీరో కూతురు..!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలి ఖాన్ కూతురు సారా ఆలి ఖాన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. కేథర్ నాథ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సారా ఆలి ఖాన్ ఆ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో క్లోజ్ గా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని సారా అలి ఖాన్ లవ్ చేస్తుంది కార్తిక్ ఆర్యన్ అని తెలుస్తుంది. చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి సారా అతనితో తన లైఫ్ షేర్ చేసుకోవాలని చూస్తుందట.

కార్తిక్, సారా ఇద్దరు ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ఈమధ్య సారా మదర్ కూడా వారి ప్రేమకు తన అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. అయితె ఇద్దరికి ఓ కండీషన్ పెట్టిందట. కెరియర్ లో సెటిల్ అయ్యాకనే పెళ్ళి గురించి ఆలోచించమని అప్పటివరకు కాస్త హద్దుల్లో ఉండమని చెప్పిందట. అయితే అప్పుడు సరే అని తల ఊపిన ఈ ప్రేమ జంట ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ అలరిస్తున్నారు.

వీరి జోరు చూస్తుంటే కెరియర్ ఎలా ఉన్నా ముందు ఒకటయ్యేలా ఉన్నారు. పెళ్లి తర్వాత కార్తిక్ ఆర్యన్ సినిమాలను కొనసాగించొచ్చు కాబట్టి త్వరలోనే కార్తి, సారాల లవ్ కు పెళ్లితో ప్రమోషన్ వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరి లవ్, డేటింగ్ విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంకో క్రేజీ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తిక్, సారా కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.

Leave a comment