యాక్షన్ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన సినిమా సాహో ఆగస్టు 30న విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఒకేసారి విడుదల అవటానికి అన్నిచోట్ల రంగం సిద్ధమైంది. ఈ చిత్రం విడుదల కోసం ప్రభాస్ అభిమానులు గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఆ ట్రైలర్ చూస్తుంటే ప్రతిప్రక్షకుడికి ఇది హాలీవుడ్ చిత్రమా ? టాలీవుడ్ చిత్రమా అన్న డౌట్ వాళ్ళ మైండ్ లోకి వచ్చింది. అంత అద్భుతంగా ఆ ట్రైలర్ కట్ చేశారు. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ మాస్ యాక్షన్ ఎంట్రటైన్ మెంట్ లా తలపిస్తుంది. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే చేస్తుంది. సీడెడ్ హక్కులు 25కోట్లకు అమ్ముడైయ్యాయి. తూర్పు &పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలిపి ఈసినిమా రైట్స్ 19కోట్ల ధర పలుకగా వాటితో కలిపి కోస్టల్ ఆంధ్రా లో ఈ మూవీ 60కోట్ల బిజినెస్ చేసిందట. గతంలో బాహుబలి 2 తెలంగాణ ,ఏపీ లో కలిపి 122కోట్ల బిజినెస్ చేసింది.
ఈ మద్య రిలీజ్ అయిన ట్రైలర్ కి దేశ విదేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికీ ఈ మూవీ కి సంబంధించిన బిజినెస్ ఇతరభాషల్లో ముగిశాయి. ప్రస్తుతం తెలుగు థియేట్రికల్ హక్కులు ఇప్పుడు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు థియేట్రికల్ హక్కులను రూ .170 కోట్లకు తీసుకుంటున్నట్లు టాక్. బాహుబలి: ది కన్క్లూజన్ తుది పరుగులో 310 కోట్ల రూపాయల థియేట్రికల్ హక్కు కి అమ్ముడు పోయింది… బాహుబలి: ది బిగినింగ్ రూ .184 కోట్లు. రామ్ చరణ్ రంగస్థలం తెలుగులో రూ .120 కోట్లు థియేట్రికల్ హక్కుకు పోయింది. తాజాగా సుజీత్ దర్శకుడిగా ప్రభాస్ నటించిన ‘సాహూ’ మూవీ ఈ రేంజ్ లో పోవండ గ్రేట్ అని అంటున్నారు టాలీవుడ్ వర్గం. ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుంది. సాహో ఆగస్టు 30 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భారతీయ భాషలలో విడుదల చేస్తుంది.