సాహో ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా సాహో. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టింది. సాహో 320 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది.

బాలీవుడ్ లో భారీగా ప్రమోట్ చేస్తున్న ప్రభాస్ మొదటిరోజు భారీ టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. సాహో ఫస్ట్ డే టార్గెట్ 100 కోట్లు. బాహుబలి 2 మొదటిరోజు 120 కోట్ల దాకా రాబట్టింది. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే సాహోపై సెన్సార్ టీం నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. తప్పకుండా మళ్లీ ప్రభాస్ సంచలనం సృష్టించడం ఖాయమని తెలుస్తుంది.

అందుకే దాదాపు వన్ వీక్ నుండి ప్రభాస్ సాహో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన సాహో సినిమా మరోసారి తెలుగు సినిమా సత్తా చూపిస్తుందని అంటున్నారు. మరి ఇంత భారీ అంచనాలు ఏర్పరచుకున్న సాహో ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a comment