అక్కినేని ఫ్యామిలీలో చిచ్చు పెడుతున్న సమంత..!

అక్కినేని ఫ్యామిలీలో గొడవలు అవుతున్నాయా.. మామా కోడళ్ల మధ్య అంతర్ యుద్ధం జరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. చైతు, సమంతల పెళ్లికి కూడా ఎలాంటి అడ్డు చెప్పని నాగార్జున ఇలా ఎందుకు కోడలి మీద సీరియస్ గా ఉన్నాడు అంటే.. నాగ్ ఈమధ్య నటించిన మన్మథుడు 2 సినిమా రిజల్ట్ కారణమని తెలుస్తుంది. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో నాగార్జున, రకుల్ జంటగా నటించిన సినిమా మన్మథుడు 2.

ఈ సినిమా ఓ ఫ్రెంచ్ సినిమా లైన్ తో తీశారు. అయితే ఈ సినిమా మొదటి నుండి వర్క్ అవుట్ అవదన్న విధంగా సమంత కామెంట్స్ ఉన్నాయట. నాగ చైతన్య, సమంత ఇద్దరు మన్మథుడు 2 వద్దని వారించారట. కాని నాగార్జున వారి మాటను లెక్క చేయకుండా ఈ సినిమా చేశాడట. అందుకే నాగార్జున, సమంతల మధ్య దూరం పెరిగిందని అంటున్నారు.

అంతేకాదు నాగార్జున ప్రస్తుతం చేయాల్సిన బంగర్రాజు సినిమాలో చైతుని వద్దని సమంత వారిస్తుందట. అందుకే బంగార్రాజు సినిమా లేట్ అవుతుందని అంటున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వల్ గా బంగార్రాజు చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి మామ కోడళ్ల అలకలు తీరి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తే మంచిదని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Leave a comment