ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో ట్రైలర్ ఎట్టకేలకు నేడు రిలీజ్ అయ్యింది. బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం తెలుగు జనాలే కాకుండా యావత్ ఇండియన్ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే సాహో మేకింగ్ వీడియోలు, పోస్టర్లు, టీజర్లు కలగలసి చిత్రంపై అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడే రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను పీక్స్కు తీసుకెళ్లింది.
పూర్తిగా హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలదన్నేలా సాహో ట్రైలర్ను రూపొందించారు చిత్ర యూనిట్. ఓ అండర్కవర్ సీక్రెట్ ఏజెంట్గా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు మనకు ట్రైలర్లో చూపించారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ప్రియులకు కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ స్టఫ్ ఉంది. ప్రభాస్ మ్యాన్లీ లుక్, శ్రద్ధా కపూర్ అందాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీన్స్తో ట్రైలర్ను నింపేశారు చిత్ర యూనిట్. ఇక భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నారు. బాలీవుడ్ నటీనటులతో దర్శకుడు సుజిత్ చేసిన ఈ యాక్షన్ మూవీని అంచనాలకు మించి రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్లు ఈ ట్రైలర్లో చాలానే చూపించారు. ఇక కొన్ని సీన్స్లో ప్రభాస్ ఎలివేషన్కు మాటలు లేవనే చెప్పాలి. అటు బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ కూడా ట్రైలర్కు పర్ఫెక్ట్ యాప్ట్ కావడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఇప్పటి వరకు కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే ఆతృతగా ఉన్నారు. ఇక ఈ ట్రైలర్ చూసిన తరువాత యావత్ భారత సినిమా అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఇక ఆగష్టు 30న ఒక తెలుగు సినిమాకు యావత్ ప్రపంచం సాహో అనాల్సిందే అంటున్నారు సినీ జనాలు.