‘ కొబ్బ‌రిమ‌ట్ట‌ ‘ కు షాకింగ్ క‌లెక్ష‌న్స్‌..

హృదయకాలేయం సినిమాతో సోషల్ మీడియా స్టార్, బర్నింగ్ స్టార్ గా మారిన సంపూర్ణేష్ బాబు న‌టించిన సినిమా ‘కొబ్బరిమట్ట’. ఈ సినిమాకు రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. సంపూ త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ సినిమాలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడుగా సందడి చేశాడు. ఓ మోస్తరు అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన కొబ్బరిమట్ట మంచి టాక్ సొంతం చేసుకొంది.

మ‌రో వైపు శుక్ర‌వారం నాగార్జున మ‌న్మ‌థుడు 2, అన‌సూయ క‌థ‌నం, విశాల్ టెంప‌ర్ రీమేక్ అయోగ్య లాంటి సినిమాలు ఉన్నా కూడా శ‌నివారం వ‌చ్చిన కొబ్బ‌రిమ‌ట్ట మొదటి రోజే పెట్టిన బడ్జెట్ లో దాదాపు 80% రికవరీ చేసినట్లు సమాచారం. ఇక ఆదివారంతో ఈ సినిమా చాలా చోట్ల లాభాల్లోకి వ‌చ్చేసింది. పాజిటివ్ టాక్ రావడం.. వ‌రుస సెల‌వులతో సినిమా మంచి లాభాలు సాధించే దిశ‌గా దూసుకుపోతోంది.

కామెడీలో కొత్త యాంగిల్ చూపించి డైలాగ్స్ డెలివరీ కూడా కరెక్ట్ గా వర్కౌట్ అయ్యేలా చూడ‌డంతో ఈ మూవీకి హాస్యంకోసం వెళ్లే ప్రతి ప్రేక్షకుడు నిరుత్సాహపడరు. అంతగా సంపూ ఈ మూవీలో నవ్వించాడు అని చెప్పాలి. ఇక మూవీ హీరో సంపూ మూడు విభిన్న పాత్రలలో అద్భుతంగా నటించిన చక్కని హాస్యం పంచారు. తనదైన డైలాగులతో, డాన్స్ లతో, నటనతో సంపూ ప్రేక్షకులకు కావలసినంత హాస్యం పంచారు, సోమ‌వారం నుంచి ఓ మోస్త‌రు వ‌సూళ్లు రాబ‌ట్టినా సంపూ రేంజ్‌కు సూప‌ర్ హిట్ అవుతుంది.

Leave a comment