యంగ్రెబల్స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. రూ.350 కోట్లతో కనివినీ ఎరుగని యాక్షన్ విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరో మూడు రోజుల టైం మాత్రమే ఉంది. కేవలం భారతదేశ సినిమా లవర్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు, ఇతర భారతీయులు అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైట్మెంట్తో వెయిటింగ్లో ఉన్నారు.
సాహోను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అటు ప్రమోషన్లు కూడా హీటెక్కించేస్తున్నారు. హీరో ప్రభాస్ ఇప్పుడు ప్రమోషన్లలో అన్నీ తానే కనిపిస్తున్నాడు. అన్ని బాగానే ఉన్నా ప్రభాస్ నార్త్ ఇండియన్ ప్రమోషన్లలో మాత్రమే ఎక్కువుగా కనిపిస్తున్నాడు. కేవలం బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అక్కడే ఎక్కువుగా ప్రమోషన్లు చేస్తోన్న ప్రభాస్‌కు తెలుగు మీడియా, టాలీవుడ్ కనపడడం లేదా ? అన్న విమర్శలు వస్తున్నాయి.
అసలు ప్రభాస్‌ను స్టార్ చేసింది… నేషనల్ హీరోను చేసింది టాలీవుడ్ వాళ్లే… తెలుగు ప్రేక్షకులు.. తెలుగు మీడియానే అన్నది ఇక్కడి వాళ్ల అభిప్రాయం. ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే పూర్తిగా తెలుగు మీడియాను పక్కన పెట్టేసి… ఇక్కడి వాళ్లు ఎలాగూ సినిమా చూస్తారులే అన్న కాన్ఫిడెన్స్‌తో ప్రభాస్ కేవలం నార్త్ ఇండియాలోనే భారీగా ప్రమోషన్లు చేయడంతో ఇక్కడ వారంతా గుర్రుగా ఉన్నారు.
ఒక్క ప్రభాస్ మాత్రమే కాకుండా సాహో యూనిట్ కూడా తెలుగు మీడియాను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరి ఈ మూడు రోజుల్లో అయినా వాళ్లకు తెలుగు మీడియా, తెలుగు ప్రేక్షకులు కనపడతారా ? లేదా ? అన్నది చూడాలి.