ఈగతో మనకు విలన్ గా పరిచయమైన కిచ్చ సుదీప్ కన్నడలో పెద్ద స్టార్. బాహుబలి సినిమాలో సైన్యాధ్యక్షుడిగా షేర్‌ఖాన్‌గా అదరగొట్టిన సుదీప్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టేజియస్ మూవీ సైరా నరసింహారెడ్డిలో అరకు రాజుగా కీలక పాత్రలో అలరించనున్నాడు. సైరా కంటే ముందుగా సుదీప్ మరో సినిమాతో మన ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. సెప్టెంబర్ 12న పహిల్వాన్ రూపంలో వస్తున్నాడు.
ఓ కుస్తీ పోటీలకు చెందిన యోధుడి కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ట్రైలర్‌ను బట్టి చూస్తే కృష్ణ(కిచ్చ సుదీప్)ఉండే ఊరు కుస్తీ పోటీలకు ప్రసిద్ధి. గురువు(సునీల్ శెట్టి) ఆధ్వర్యంలో ఈ విద్యలో రాటుదేలి చుట్టుపక్క గ్రామాల్లో పేరు తెచ్చుకుని ఉంటాడు. ఆ తర్వాత ఆవేశం వల్ల కృష్ణ ఎలాంటి జీవితాన్ని కోల్పోయాడు ? చివరకు ఇదే విద్యతో ఏం సాధించి అందరిని మెప్పించాడు? అన్నదే సినిమా కథగా తెలుస్తోంది.
ట్రైలర్లో సుదీప్ లుక్స్‌తో ఆదరగొట్టాడు. ఆ బాడీ పెంచేందుకు ప్రత్యేకంగా కసరత్తులు కూడా చేశాడు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ని రివీల్ చేయలేదు. అయితే కథలో గతంలో చూసిన శ్రీహరి భద్రాచలం – సల్మాన్ ఖాన్ సుల్తాన్ ఛాయలు కనిపిస్తాయి. హీరో ఓ విద్యలో రాటుదేలి తర్వాత దానికి దూరం కావడం తర్వాత ఒక లక్ష్యంతో అవార్డులు సాధించడం పాయింట్ వేరే వాటిలో కూడా వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే మేకింగ్, టేకింగ్‌తో సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది. మరి సుదీప్ ఏం చేస్తాడో ? చూడాలి.