Moviesఒక్క దెబ్బ‌తో వెంకీ సీన్ రివ‌ర్స్‌..

ఒక్క దెబ్బ‌తో వెంకీ సీన్ రివ‌ర్స్‌..

సంక్రాంతికి వ‌చ్చిన ఎఫ్ 2 వంటి అద్భుతమైన హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ తన తదుపరి చిత్రం వెంకీ మామా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వెంకీ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి మొదటిసారి జతకడుతున్నాడు. జై ల‌వ‌కుశ సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న డైరెక్ట‌ర్‌ కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా ఈ కామిక్ ఎంటర్టైనర్‌లో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ సినిమా చాలా రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎప్పుడో అక్టోబ‌ర్ 4న ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింద‌న్న‌ది దాదాపు ఖ‌రారైంది. సైరా ఎలాగూ అక్టోబ‌ర్ 2న వ‌స్తోంది. ఈ సినిమాకు పోటీగా వెళ్లే రిస్క్ వెంకీమామ మేక‌ర్స్ చేయ‌డం లేదు. ఇటీవ‌ల వెంకీ కాలికి గాయం అవ్వ‌డంతో తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి.

ఎలాగూ ద‌స‌రా సీజ‌న్ మిస్ అవ్వ‌డంతో ఇప్పుడు అక్టోబ‌ర్ చివ‌రి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఏదేమైనా వెంకీకి నిజంగానే దెబ్బ త‌గిలి సినిమాను వాయిదా వేశారో లేదా సైరా దెబ్బ‌కు పోటీగా వెళ్లి దెబ్బ తినడం ఎందుకు అనుకున్నారో కాని వెంకీమామ వాయిదా ప‌డిపోయింది.

ఇండ‌స్ట్రీలో ఈ సినిమా వాయిదాపై కొంద‌రు వెంకీకి గాయం అంటుంటే.. మ‌రి కొంద‌రు సైరా భ‌యం అని చ‌ర్చించుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. థ‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news