‘ కొబ్బ‌రిమ‌ట్ట ‘ దెబ్బ‌తో మ‌న్మ‌థుడు 2 కుదేల్‌

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన మ‌న్మ‌థుడు 2 డిజాస్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర‌మైన పెర్పామెన్స్ చేస్తోంది. శుక్ర‌వారం మ‌న్మ‌థుడు 2తో పాటు మొత్తం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన‌సూయ క‌థ‌నం, విశాల్ టెంప‌ర్ రీమేక్ అయోగ్య కూడా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇక శ‌నివారం బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు న‌టించిన కొబ్బ‌రిమ‌ట్ట సినిమా కూడా రిలీజ్ అయ్యింది.

ట్విస్ట్ ఏంటంటే నాలుగు సినిమాల మ‌ధ్య‌లో వ‌చ్చిన సంపూ కొబ్బ‌రిమ‌ట్ట బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌తి షోకు స్ట్రాంగ్ అవుతూ వ‌స్తోంది. కేవ‌లం రెండు రోజుల‌కే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాట‌లోకి వ‌చ్చేసింది. ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు ఉన్నా, మ‌రో మూడు సినిమాలు పోటీలో ఉన్నా కొబ్బ‌రిమ‌ట్ట స్ట్రాంగ్‌గా న‌డుస్తుండ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు సైతం షాక్ ఇచ్చేలా ఉంది.

మొదటి రోజుతో పోల్చినప్పుడు రెండో రోజు మ‌రింత‌గా భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. అదే టైంలో హైద‌రాబాద్‌లో ప‌క్క ప‌క్క‌నే ఉన్న థియేట‌ర్ల‌లో మ‌న్మ‌థుడు 2కు తొలి రోజు వ‌చ్చిన వ‌సూళ్ల కంటే కొబ్బ‌రిమ‌ట్ట‌కే ఎక్కువ వ‌చ్చాయి. ఫ‌స్ట్ వీకెండ్ మూడు రోజులు కొబ్బ‌రిమ‌ట్ట వ‌సూళ్ల ముందు మ‌న్మ‌థుడు 2 పూర్తిగా తేలిపోయింది.

ఇక మ‌న్మ‌థుడు 2ను ఇప్ప‌టికే చాలా థియేట‌ర్ల‌లో ఎత్తివేస్తున్నారు. ఈ స్క్రీన్లు అన్ని కొబ్బ‌రిమ‌ట్ట‌కు ఇస్తున్నారు. సోమ‌వారం కూడా హాలీడే కావ‌డంతో సోమ‌వారం కూడా ఈ సినిమాకు మిగిలిన సినిమాల కంటే ఎక్కువ వ‌సూళ్లు రానున్నాయి. ఇక ఈ సినిమాకు మ‌రింత‌గా ప్ర‌మోష‌న్ క‌ల్పించేందుకు హీరో సంపూర్ణేష్ బాబు తన బృందంతో కలిసి ఇప్పటికే ఏపీ, మరియు తెలంగాణలో పర్యటిస్తున్నారు.

Leave a comment