ఇటీవల కాలంలో సాహో మూవీకి వచ్చినంత ప్రచారం మరే చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి 1,2 సినిమాలతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా అసేతు హిమాచలాన్ని అంటింది. దీంతో బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలో నటిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.
ఎవ్వరి అంచనాలకు అందకుండా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నేషనల్ క్రేజ్ వచ్చేసింది. రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తెరకెక్కడంతో పాటు ట్రైలర్, టీజర్స్ ద్వారా పెరిగిన అంచనాలతో పాటు, ప్రభాస్ నిరవధికంగా పాల్గొన్న ప్రొమోషన్స్ కార్యక్రమాల వలన సాహో చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ప్రి రిలీజ్ బిజినెస్ కూడా ఏకంగా రూ. 333 కోట్ల వరకు జరిగింది. ఈ నేపథ్యంలో సాహో యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ ద్వారా $800,899 డాలర్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. అంటే ఇది రూ.5 కోట్ల వరకు ఉంటుంది. మొత్తం 290 లొకేషన్స్ నుండి గురువారం రాత్రి 10:00 వరకు వచ్చిన సంచారం ప్రకారం సాహో ఆ కలెక్షన్స్ రాబట్టిందట.
ఈ సినిమాను అక్కడ రూ.42 కోట్లకు అమ్మారు. అమ్మాకాలు… వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే ఇది ప్రభాస్‌కు ఎదురు దెబ్బే అనుకోవాలి. వారాంతంలో పాటు, ఒక రోజు చవితి సెలవు దినం రావడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. మరి దీనిని యూజ్ చేసుకుని సాహో ఏ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తాడో ? చూడాలి.