దర్శకధీరిడు ఎస్ ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరియు అలియా భట్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరంభీంగా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను ఆగష్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ లుక్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ గుడ్ న్యూస్ వినడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వేట్ చేశారు. ఈ సినిమాలో కొమరంభీం పాత్రలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందనే దానిపై అందరిలోనూ ఆశక్తిగా మారింది. అయితే వాస్తవానికి రాజమౌళి తన సినిమాలకు మంచి మైడ్ గేమ్‌తో మార్కెటింగ్ చేస్తాడు.
ప్రేక్షకుల్లో తన సినిమాకు క్రేజ్ పెంచడానికి సినిమాకు సంబంధించి టీజర్లు, ట్రైలర్లు, లుక్స్ అంటూ ఒక్కోటి విడుదల చేస్తుంటాడు. అయితే ఈయన సినిమాలకు మార్కెటింగ్ విషయంలో ఎలాంటి ఢోకా లేకపోయినా రాజమౌళి మరియు ధనయ్య అనుకునేట్టు మార్కెటింగ్ పెరగాలన్నదే వీరి ప్లాన్. అందుకే ప్రస్తుతం ఇటు సాహో అటు సైరాలకు బజ్ ఎక్కువగా ఉన్నప్పటీకి వీటిని బీట్ చేసేందుకు ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసి మరింత మార్కెటింగ్ పెంచేందుకు డిసైడ్ అయ్యారు. నిజానికి రాజమౌళికి సెల్ఫ్ మార్కెటింగ్ మరియు సినిమా మార్కెటింగ్ లాంటివి పెంచే జిమ్మిక్కులు బాగా తెలుసు. ఇక ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతున్న ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి.