సితార డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కూతురు సితార వేస్తున్న డ్యాన్సుల‌కు జ‌నం ఫిదా కావాల్సిందే… మ‌హేష్‌బాబు జిమ్ చేసే రూమ్‌నే త‌న డ్యాన్స్ కు వేధిక‌గా చేసుకుని సితార చేస్తున్న డ్యాన్స్‌ను నెటిజ‌న్లు ఆదిరిస్తున్నారు. ఆద్య అండ్ సితారా అనే యూట్యూబ్ ఛాన‌ల్‌ను సొంత‌గా ఏర్పాటు చేసుకున్న సితార త‌న డ్యాన్స్‌ల‌ను ఇందులో పోస్టు చేస్తుంది.

ఇప్పుడు సితార త‌న తండ్రి న‌టించిన సినిమా మ‌హ‌ర్షి సినిమాలోని పాల‌పిట్ట అనే పాట‌కు డ్యాన్స్ చేసి అందరిని ఫిదా చేస్తుంది. త‌న డ్యాన్స్‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న సితార క్యూట్ క్యూట్ స్టెప్పులు వేస్తుంది.

సితార చేస్తున్న డ్యాన్స్‌కు ఇటు సితార అభిమానుల‌ను సొంతంగా సంపాదించుకుంటుండ‌గా, అటు మ‌హేష్‌బాబు అభిమానులు కూడా తండ్రిని మించిపోతుంద‌ని మురిసిపోతున్నారు. ఈ వ‌య‌స్సులోనే ఇలా డ్యాన్స్‌లు చేస్తున్న సితార‌ను చూసి సిని జ‌నాలు ఏనాటికైనా టాలీవుడ్‌లో తెర‌గ్రేంటం చేస్తుంద‌ని అంటున్నారు.. సో సితార స్టెప్పుల‌ను మీరోమారు చూడండి…

View this post on Instagram

❤️

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

Leave a comment