టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 26న సౌత్ ఇండియా లోని నాలుగు భాషల్లో డియర్ కామ్రేడ్ విడుదల అవుతోంది. ఈ సినిమా తర్వాత విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటించేందుకు సైన్ చేశాడు. హీరో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్‌తో చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ తో సినిమా చేసేందుకు విజయ్ నో చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరో తర్వాత విజయ్ కొరటాల శివతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించటం విశేషం. పూరిపై నమ్మకం లేని విజయ్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సైన్ చేశాడంటున్నారు.
ఆరు ప్లాపుల తర్వాత ఎట్టకేలకు ఒక ఫామ్ లోకి వచ్చిన పూరితో రిస్క్ చేసేందుకు విజయ్ సాహసం చేయడం లేదట. పూరికి వచ్చిన హిట్ గాలివాటంగా ఉందని… మళ్లీ అతడితో కమిట్ అయితే హిట్ వస్తుందన్న నమ్మకం లేదని… పూరి ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో ? అని విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే కొరటాలతో వెళితే సేఫ్ సైడ్‌లో ఉన్నట్టు విజయ్ ఆ సినిమాపై ఆసక్తితో ఉన్నాడంటున్నారు.