మహర్షి తర్వాత టాలీవుడ్లో ఏజెంట్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా లాంటి చిన్న సినిమాలు మినహా ఒక్క సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవ్వలేదు. జూన్ నెల ఇలా నిస్సారంగా వెళ్లిపోయింది. ఇప్పుడు జూలై వంతు వచ్చేసింది. జూలైలో ఇప్పటికే డజన్ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. కానీ వీటి వరుస చూస్తుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు.
ముందుగా ఈనెల 5న ఐదు సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. ఇందులో సమంత నటించిన ఓ బేబి.. ఆది సాయికుమార్ నటించిన బుర్రకథ రేసులో ఉన్నాయి. వీటితో పాటు రియల్ స్టార్ శ్రీహరి వారసుడు మేఘాంశ్ శ్రీహరి నటించిన రాజ్ దూత్, దుర్మార్గుడు- కె.ఎస్.100 లాంటి చిత్రాలు ఆ రోజునే వస్తున్నాయి. వీటిల్లో ఓ బేబీ, బుర్రకథ మీద మాత్రమే ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి.
ఇక కొన్నేళ్లుగా హిట్ లేని రామ్ – పూరి కాంబోలో వస్తోన్న ఇస్మార్ట్ శంకర్ 18న డేట్ లాక్ చేశారు. ఈ సినిమాపై అంచనాలు ఉన్నా పూరీని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. ఇక హిట్ లేని మరో హీరో సందీప్ కిషన్ నీను వీడని నీడను నేనే 12న రిలీజ్ తేదీని లాక్ చేశారట. ఈ రోజునే విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ దొరసాని, షకలక శంకర్ కేడీ నెంబర్ 1, మాయాబజార్ వస్తున్నాయి. వీటిల్లో ఏ ఒక్క సినిమాపై సరైన నమ్మకాలు లేవు.
జూలై 19న సీత లాంటి ఫ్లాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు, ఆర్.ఎక్స్100 ఫేం కార్తికేయ నటించిన గుణ 36, సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట వస్తున్నాయి. ఓవరాల్‌గా చూస్తే జూలైలో రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ – దొరసాని చిత్రాలకు ప్రచారంలో వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. ఓ బేబి- బుర్రకథ- రాజ్ దూత్ ప్రచారం పరంగా ఫర్వాలేదు. మిగిలిన సినిమాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.