యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రాక్షసుడు యమస్పీడుగా షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా సక్సెస్ దొరకని ఈ హీరో, ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.
ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రాక్షసుడు సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కగా అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు భీబత్సంగా నచ్చుతుందని వారు తెలిపినట్లు చిత్ర యూనిట్ అన్నారు. బెల్లంకొండ బాబు ఈ సినిమాలో బాగా యాక్ట్ చేసినట్లు.. కథలో ఉన్న సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని వారు కితాబిచ్చారట. ఇక ఈ సినిమాకు వారు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసారు.
ఒక క్రైమ్ చుట్టూ తిరిగే ఈ కథ అన్న వర్గాల ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఆగష్టు 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.