డాషింగ్ డైరెక్టర్ పూరీ-రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా `ఇస్మార్ట్ శంకర్`. ఈ చిత్రాన్ని టూరింగ్ టాకీస్, పూరి కనక్ట్ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న వీళ్లకు ముందుగా అనుకున్నంత ప్రీ రిలిజ్ బిజినెస్ అయితే జరగలేదు. ఇటీవల రిలీజ్ అయిన రెండు ట్రయిలర్లు, టీజర్, సాంగ్స్ మాత్రం ఈ సినిమాకు హైప్ తీసుకువచ్చాయి. ఇటు డైరక్టర్, అటు హీరో ట్రాక్ రికార్డు కాస్త అటు ఇటుగా ఉండడంతో ఓపెనింగ్స్ బాగుండాలంటే ఏదో ఒకటి చేయాలని పూరి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా బిజినెస్ క్లోజ్ చేసుకొని విడుదల వారంలోకి వచ్చేసింది. సినిమాను తెలుగు రాష్ట్రాల మొత్తంమీద నలుగురు బయ్యర్లకు విక్రయించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఆంధ్ర ఏరియాకు అభిషేక్ పిక్చర్స్ తీసుకుంది. ఆరు కోట్ల రేషియోలో ఇస్మార్ట్ శంకర్ ను ఆంధ్రలోని గుంటూరు మినహా మిగిలిన ఏరియాలకు అభిషేక్ పిక్చర్స్ తీసుకుంది. అభిషేక్ పిక్చర్స్ మొత్తం ఫస్ట్ కాపీనే తీసుకోవాలని ప్రయత్నించింది. అయితే రేటు దగ్గర తేడా వచ్చి కుదరలేదు.
సీడెడ్ హక్కులను ఫైనాన్సియల్ లావా దేవీల్లో భాగంగా శోభన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. నైజాం హక్కులను వరంగల్ కు చెందిన బయ్యర్ కు ఇచ్చారు. ఈ విధంగా ఇస్మార్ట్ శంకర్ బిజినెస్ క్లోజ్ చేసుకుంది. అన్నీకలిపి సినిమాకు అద్భుతంగా కాకపోయినా, టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు బోగట్టా. ఈ సినిమా ప్రచారంలో తీసుకున్న జాగ్రత్తలు బాగానే వర్కవుట్ అయ్యాయి. అలాగే నిర్మాత చార్మీకి ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ మీద మంచి మొత్తమే వచ్చిందని తెలుస్తోంది.