మూడు సినిమాల్లో ఏది హిట్టు.. ఏది ఫట్టు..!

శుక్రవారం(12th జులై) వచ్చింది అంటే బాక్సాఫీస్ పై సినిమాల దండయాత్ర చేసినట్టే. స్టార్ సినిమాల రిలీజ్ టైం లో చిన్న సినిమాలకు ఛాన్స్ ఉండదు. అందుకే స్టార్ సినిమాలు రాని టైంలో కుప్పలు తెప్పలుగా సినిమాలు రిలీజ్ అవుతాయి. శుక్రవారం(12th జులై) బాక్సాఫీస్ పై ఏకంగా 3 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి సందీప్ కిషన్ థ్రిల్లర్ అటెంప్ట్ నిను వీడని నీడను నేనే కాగా మరోటి ఆనంద్ దేవరకొండ, శివాత్మిక నటించిన దొరసాని.. ఈ రెండితో పాటుగా రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా రాజ్ దూత్ సినిమా వచ్చింది.

మూడు మూడు రకాలైన జానర్ సినిమాలని చెప్పొచ్చు. సందీప్ ఎన్.వి.ఎన్.ఎన్ సినిమా పూర్తిగా థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్న సందీప్ తనకు పక్కా హిట్ ఇస్తుందని చెప్పారు. అయితే టాక్ వేరేలా ఉంది. కార్తిక్ రాజు కథ బాగున్నా దాన్ని తెరకెక్కించడంలో తప్పులు దొర్లాయని అంటున్నారు. ఫైనల్ గా సందీప్ కిష కు పాస్ మార్కులు పడినట్టు తెలుస్తుంది.

ఇక శుక్రవారం(12th జులై)రిలీజైన సినిమాల్లో క్రేజీ మూవీ దొరసాని ఒకటి. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా చేయడమే కాకుండా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేయడం కూడా ఈ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. రొటీన్ కథనే తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర. అయితే కథ రొటీన్ గా ఉన్నా హృదయానికి హత్తుకునేలా సినిమా తెరకెక్కించారని తెలుస్తుంది. ఆనంద్, శివాత్మికల నటన కూడా మొదటి సినిమా అన్నట్టుగా లేదని ప్రశంసిస్తున్నారు.

శుక్రవారం(12th జులై) రిలీజైన మేఘాంశ్ శ్రీహరి రాజ్ దూత్ అర్జున్ కారిక్ డైరక్షన్ లో వచ్చింది. తన ప్రేమని దక్కించుకోవడం కోసం సంజయ్ రాజ్ దూత్ బైక్ తెచ్చివ్వాలని కండీషన్స్ పెడతారు. దీనికోసం హీరో ఏం చేశాడన్నది కథ. సినిమా ఫన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించినా కథనం బోర్ కొట్టిందని అంటున్నారు.

ఫైనల్ గా మూడు సినిమాల్లో దొరసాని బెస్ట్.. నిను వీడని నీడను నేను సెకండ్ ప్లేస్ లో నిలవగా.. థర్డ్ లో రాజ్ దూత్ నిలిచిందని తెలుస్తుంది.

Leave a comment