” ఎవ‌రు ” టీజ‌ర్ ఫుల్ స‌స్పెన్స్‌..! మ‌ర్డ‌ర్‌, రేప్‌.. ఏది నిజం.?

గూడాఛారి సినిమా త‌ర్వాత అడ‌వి శేష్ న‌టిస్తోన్న సినిమా ఎవ‌రు. అడవి శేష్ – రెజీనా జంట‌గా తెర‌కెక్కిన ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ వ‌చ్చే నెల 15న రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ వ‌దిలారు. 1.11 నిమిషం ఉన్న ఈ టీజ‌ర్ అంతా స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ మెయింటైన్ చేసింది. సినిమా ఓ హ‌త్య‌కు సంబంధించిన ఇన్వెస్ట్‌గేష‌న్ క‌థ‌తో న‌డుస్తుంద‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది.

ఇక త‌మిళ‌నాడు పోలీస్ ఆఫీస‌ర్‌గా అడవి శేష్ న‌టిస్తున్నాడు. పోలీసులు మ‌ర్డ‌ర్ అంటున్నారు.. మీరు రేప్ అంటున్నారు అని కూడా శేష్ డైలాగ్ చెపుతాడు. ఇక సినిమాలో కూడా రెజీనా అందాలు బాగానే ఆరబోసినట్లు, ఆ సినిమాకు అది పెద్ద అట్రాక్షన్ అవుతుందని టీజ‌ర్ చెప్పేస్తోంది. క‌థ పాత‌దే అయితే ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంద‌న్న ఆస‌క్తి రేపేలా టీజ‌ర్ ఉంది.

పివిపి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చేనెల 15న విడుదలవుతుంది. ఈ సినిమాలో రెజీనా చాలా హాటుగా, ఘాటుగా కనిపిస్తుందని తెలుస్తోంది. ఇక గూడ‌ఛారి త‌ర్వాత శేష్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో టాప్ రేట్ల‌కు ఈ సినిమాను అమ్మారు.

Leave a comment