Gossipsమహాసముద్రంలో ఈత కొడుతున్న మాస్ రాజా

మహాసముద్రంలో ఈత కొడుతున్న మాస్ రాజా

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం RX100 దర్శకుడు అజయ్ భూపతితో తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమాకు ‘మహాసముద్రం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా కథాపరంగా రవితేజ పిచ్చపిచ్చగా నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నాడు రవితేజ.

కాగా ఈ సినిమాలో రవితేజతో పాటు మరో యంగ్ హీరో నటించనున్నట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు సినిమాతో లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్న హీరో సిద్ధార్ధ ప్రస్తుతం ఫేడవుట్ అయ్యాడు. అయితే అజయ్ భూపతి రాసుకున్న కథ ప్రకారం రవితేజతో పాటు మరో హీరోకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర ఉంది. ఈ పాత్రలో నటించేందుకు సిద్ధార్థను సంప్రదించగా వెంటనే ఒప్పేసుకున్నాడట. దీంతో చాలా గ్యాప్ తరువాత సిద్ధార్థ తెలుగులో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్, వగైరా విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా మాస్ రాజాతో సినిమా అంటే ఆ కిక్కే వేరుంటుందని సిద్ధార్ధ ఈ సినిమాతో తెలుసుకుంటాడని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news