హిట్ ఫెయిర్ విజయ దేవరకొండ – రష్మిక జంటగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ శుక్రవారం ప్రేక్షకుల ముందు రాబోతుంది. వరల్డ్ వైడ్ గా నాలుగు భాషల్లో విడుదలకబోతున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మీద ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే ప్రి పాజిటివ్ బజ్ అయితే వచ్చేసింది. యూత్‌లో ఈ సినిమాపై పిచ్చ క్రేజ్ నెలకొంది. విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ రికార్డ్ ఒక ఎత్తు అయితే… ఈ సినిమాకి విజయ్, రష్మిక చేస్తున్న భారీ ప్రమోషన్స్ ఒక ఎత్తు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాతో భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.34.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఏరియా వైజ్ బిజినెస్ ఇలా ఉంది.
డియర్ కామ్రేడ్ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్: (రూ.కోట్లలో)
నైజాం – 9.00 కోట్లు
సీడెడ్ – 3.60 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.40 కోట్లు
ఈస్ట్ గోదావరి – 1.80 కోట్లు
కృష్ణ – 1.60 కోట్లు
గుంటూరు – 2.00 కోట్లు
వెస్ట్ గోదావరి – 1.40 కోట్లు
నెల్లూరు – 0.80 కోట్లు
————————
ఏపీ /టీస్ = 22.60 కోట్లు
————————
ఇతర ప్రాంతాలు 8.00 కోట్లు
ఓవర్సీస్ 4.00 కోట్లు
————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 34.60 కోట్లు
————————————–