Movies' ఇస్మార్ట్ శంక‌ర్ ' ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌..

‘ ఇస్మార్ట్ శంక‌ర్ ‘ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌..

యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ కెరీర్‌కు ఊపిరి ఊదిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. అటు పూరి కూడా ఈ సినిమాతో ఎట్ట‌కేల‌కు ట్రాక్‌లోకి ఎక్కాడు. నాలుగు రోజుల‌కే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్న ఈ సినిమా రామ్ కెరీర్ లో రూ.25 కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.25.24 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్మార్ట్ హీరో రూ. 27.71 కోట్లు కొల్లగొట్టాడు.

మొదటి వీకెండ్ ను ఫుల్ గా వాడుకుని మంచి కలెక్షన్స్ నమోదు చేసిన ఈ చిత్రం వీక్ డేస్ లో మాత్రం నెమ్మదించింది. ఈ సినిమాను ఓవ‌రాల్‌గా రూ.17 కోట్ల‌కు అమ్మారు. ఇప్ప‌టికే రూ.10 కోట్ల లాభం వ‌చ్చింది. ఇక‌పై వ‌చ్చేదంతా లాభంగానే జేబుల్లోకి వెళ్ల‌నుంది. ఏరియాల వారీగా ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్మార్ట్ శంకర్’ మొదటి వారం కలెక్షన్స్ : (రూ.కోట్ల‌లో)

నైజామ్ – 10.98 కోట్లు

సీడెడ్ – 4.21 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.96 కోట్లు

కృష్ణ – 1.61 కోట్లు

గుంటూరు – 1.69 కోట్లు

ఈస్ట్ – 1.60 కోట్లు

వెస్ట్ – 1.35 కోట్లు

నెల్లూరు – 0.84 కోట్లు
—————————————
ఎపీ + తెలంగాణా = 25.24 కోట్లు
—————————————

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.57

ఓవర్సీస్: 0.90

వరల్డ్ వైడ్ టోటల్: 27.71 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news