టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ భారీ అంచనాల నడుమ గత శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై యూత్‌తో పాటు సినీ వర్గాల్లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు రౌడీ హీరో చేసిన ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ తరువాత మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మెజారిటీ శాతం ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడం ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిందనే చెప్పాలి.
సౌత్ ఇండియన్ భాషల్లో దాదాపు 1500 స్క్రీన్లలో రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ తొలి వీకెండ్ ముగిసే సరికి డీసెంట్ వసూళ్లు సాధించింది. తెలుగు భాషలో ఈ చిత్రం మొదటి వీకెండ్ ముగిసే సరికి రూ.18.80 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. విజయ్ యాక్టింగ్‌కు ఫిదా అయిన జనం ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా – ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం- 5.65 కోట్లు
సీడెడ్ – 1.08 కోట్లు
వైజాగ్ – 1.56 కోట్లు
తూ.గో – 1.20 కోట్లు
ప.గో – 0.83 కోట్లు
కృష్ణా – 0.73 కోట్లు
నెల్లూరు – 0.48 కోట్లు
గుంటూరు – 1.03 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 12.56 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 3.25 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 3 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 18.80 కోట్లు