నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్రను బయోపిక్ గా నిర్మించారు. బాలయ్య ఈ సినిమాను నిర్మించడంతో పాటు తన తండ్రి ఎన్టీఆర్ రోల్లో నటించడంతో ఈ బయోపిక్ స్టార్ట్ అయినప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు డీలా పడిపోవటం… బాలయ్య వ్యవహారశైలితో ఎన్టీఆర్ బయోపిక్ పై ముందు నుంచే నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. దీంతో సంక్రాంతికి వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు…. ఫిబ్రవరి లో వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.
ఈ సినిమా తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. బాలయ్య పార్టీ ఓడినా తాను మాత్రం హిందూపురంలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. హీరోయిన్లు కూడా ఎవరి సినిమాల్లో వారు బిజీ అయ్యారు. అయితే ఈ సినిమాలకు దర్శకుడిగా ఉన్న క్రిష్ మాత్రం కోలుకునేందుకు చాలా టైం పట్టింది. ఎట్టకేలకు ఈ రెండు డబుల్ డిజాస్టర్ల తర్వాత క్రిష్‌కు ఓ సినిమా దొరికిందట.
క్రిష్ కు పిలిచి అవకాశం ఇచ్చాడు దర్శకుడు రాఘవేంద్రరావు. నాగశౌర్య హీరోగా ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు రాఘవేంద్రరావు. ఈ సినిమాలో ఉండే మూడు ప్రేమకథలను ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడు… మూడు కథలను రాఘవేంద్రరావు పర్యవేక్షిస్తాడు. అలా క్రిష్ చేతికి ఇందులోంచి ఓ కథ వచ్చింది. మిగిలిన ఇద్దరు దర్శకులు ఎవరనేది త్వరలోనే తేలనుంది. ఏదేమైనా బాలయ్య ఎఫెక్ట్‌తో పాపం క్రిష్ పరిస్థితి చివరకు ఇలా వచ్చింది.