ఆ హీరోయిన్ దెబ్బ‌తో హ్రితిక్ కెరీర్ నాశ‌నం…

బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన హృతిక్‌ రోషన్‌కు కంగనా రనౌత్‌కు మ‌ధ్య గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా వార్ కొన‌సాగుతూనే ఉంది. దీనికి ప్ర‌ధానంగా కార‌ణం ఏంట‌న్న‌ది పూర్తిగా తెలియ‌క‌పోయినా హృతిక్‌ రోషన్‌ తనని మోసం చేసాడనేది కంగన బలంగా ప్రచారం చేసింది. నిజానికి వారు ప్రేమించుకున్నార‌ని, పెళ్లి చేసుకుంటార‌న్న టాక్ వ‌చ్చింది. అందుకే హృతిక్ త‌న భార్య సుసానేఖాన్‌కు విడాకాలు ఇచ్చాడ‌ని స‌మాచారం.

2013లో క్రిష్‌ 3, బ్యాంగ్‌ బ్యాంగ్‌ టైమ్‌లో హృతిక్‌ రోషన్‌కి సల్మాన్‌, షారుక్‌, అమీర్‌లతో సమానమైన మార్కెట్‌ వుండేది. వాళ్ల చిత్రాలతో పోటీగా అతని సినిమాలు కూడా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్‌ తెచ్చుకునేవి.
ఆ త‌ర్వాత కంగనా చేసిన వ్యక్తిగత డ్యామేజ్‌తో హృతిక్‌ మార్కెట్‌ దారుణంగా పడిపోయింది. అలాగే దీనికి యాక్షన్‌ సినిమాలు విడిచిపెట్టి ప్రయోగాలు మొదలు పెట్టడం కూడా మ‌రో కారణం అని చెప్పాలి.

ఇప్పటికీ కంగన, ఆమె సోదరి హృతిక్‌ని వెంటాడుతూనే ఉన్నారు. హృతిక్ భార్య‌కు విడాకులు ఇచ్చాక కంగ‌న‌ను దూరం పెట్ట‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని టాక్‌. కంగన ఎంత కన్విన్సింగ్‌గా ఆరోపణలు చేస్తుందో, ఎంతగా వ్యక్తిత్వ హననం చేస్తుందో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అయితే హృతిక్‌ దానిని సరిగ్గా డిఫెండ్‌ చేసుకోలేకపోయాడు.

చివ‌ర‌కు హృతిక్ సినిమాల విష‌యంలో కూడా ఆమె టార్గెట్ చేయ‌డం… ఆమె మాట‌లు న‌మ్మే వ‌ర్గం కూడా స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో పాటు యాంటీ ఫ్యాన్స్ ఇవ‌న్నీ క‌లిసి హృతిక్‌ మార్కెట్‌ పడిపోయేందుకు కార‌ణ‌మ‌య్యాయి.

Leave a comment