Gossipsబుమ్రాతో నాకు లింకేంటీ? : అనుపమ సీరియస్

బుమ్రాతో నాకు లింకేంటీ? : అనుపమ సీరియస్

గత కొద్ది రోజులుగా మాలీవుడ్ బ్యూటీ అనుపమపై సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ టీమ్ ఇండియా క్రికెట్ బుమ్రాతో ఆమె డేటింగ్ చేస్తుందని..ఈ జంట చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని తెగ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ మూవీ ప్రమోషన్ వర్క్ లో అనుపమ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బుమ్రా తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. అనుపమ నో కామెంట్స్ దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. బుమ్రా గురించి నన్ను అడగకండి అని సమాధానం ఇచ్చింది. అంతే కాదు ఇలాంటి విషయాలు చాలా సెస్సిటీవ్ గా ఉంటాయని మనుసు గాయపరిచేలా ఉంటాయని ఆమె అన్నారు.

కాగా, సూపర్ హిట్ కోలీవుడ్ మూవీ ‘రాక్షసన్’ కు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ ఒరిజినల్ వెర్షన్ లో అమలా పాల్ పోషించిన పాత్రలో నటిస్తుంది. ఆగస్టు 2 న ఈ చిత్రం విడుదల కానుంది. ‘నిన్ను కోరి’ ని ఇప్పుడు తమిళం లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news