డియర్ కామ్రేడ్ పోస్టుమార్టం..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ ఇండస్ట్రీ వర్గాల్లో క్రియేట్ చేసిన అలజడి మామూలుగా లేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూశారు ఫ్యాన్స్. ఇక శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ జనాలు ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టుమార్టంను తెలుగులైవ్స్ మీకు ఎక్లూజివ్‌గా అందిస్తోంది.

ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాకు సంబంధించిన రివ్యూలు కూడా వచ్చేశాయి. కొన్ని రివ్యూల్లో ఈ సినిమా అదరగొట్టబోతుందని తెలిపారు. ఇక ఈ సినిమాకు అన్ని అనుకూల అంశాలు లేవనే చెప్పాలి. కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా కథపరంగా ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య నడిచే ట్రాక్ బాగుంది. ఇక హీరోను మాస్ అంశాలతో ఎలివేట్ చేసిన విధానం సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కానీ సినిమా చాలా నెమ్మదిగా సాగినట్లు కనిపించింది. బాబీ, లిల్లీ పాత్రల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన బాగా యాక్ట్ చేశారు.

అయితే ఈ సినిమాలో కీలకమైన సెకండాఫ్‌లో పాజిటివ్ అంశాలు ఎన్ని ఉన్నాయో దానికంటే ఎక్కువ నెగెటివ్ అంశాలు ఉన్నాయి. సినిమాను మరింత ల్యాగ్‌ చేసింది సెకండాఫ్. ఇక్కడ వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులకు చిర్రెత్తుకొస్తుంది. దీనికి తోడుగా వచ్చే ఆ కర్ణకఠోరమైన సంగీతం కూడా ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎందుకు పెట్టాడో అసలు అర్ధం కాలేదు కొంతమందికి. ఏదో మమ అనే విధంగా కానిచ్చాడు దర్శకుడు.

ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా రౌడీ ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్ అని చెప్పాలి. కానీ సినిమాపై మంచి ఇంప్రెషన్ ఉన్నవారు కాస్త ఆలోచించుకుని వెళ్లా్ల్సిన పరిస్థితిని సినిమా నెరేషన్ వల్ల ఏర్పడింది. ఏదేమైనా ఒక మంచి ఎంటర్‌టైనర్ చిత్రాన్ని మిస్ కావద్దునుకుంటే ఈ సినిమాను మీరు నిస్సందేహంగా చూడవచ్చు.

Leave a comment