తాజా ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఎన్నో వివాస్పద అంశాలతో ఐసిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. అసలు ఐసీసీ ప్రపంచ కప్ ఫార్మెట్‌తో పాటు షెడ్యూల్ ను కూడా చాలా మంది తప్పుబట్టారు. ప్రపంచకప్ క్రికెట్ క్రికెట్ చరిత్రలో లేనట్టుగా ఈ టోర్నమెంట్లో ఏకంగా నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే ప్రపంచకప్ ఫైనల్లో ఐసీసీ నిబంధనలు చాలామంది ఆగ్రహానికి కారణం అయ్యాయి.
ఫైనల్ మ్యాచ్ ముగిశాక ఇంగ్లాండ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీ అందజేశాడు. ఈ ఫొటోను ట్వీట్ చేసిన ఐసీసీ ‘బెన్ స్టోక్స్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ గా’ పేర్కొంది. అంతవరకూ బాగానే ఉన్నా ఇలా సచిన్‌తో కంపేరిజన్ చేస్తూ స్టోక్స్‌ను గ్రేట్ క్రికెటర్ అనడంపై ఇప్పుడు ఇండియన్ క్రీడాభిమానులు ఐసీసీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మ్యాచ్ మొత్తంలో స్టోక్స్ వల్లే ఇంగ్లండ్ గెలిచింది.
ఈ విషయాన్ని ఎవ్వరూ తప్పుపట్టకపోయినా సచిన్‌తో స్టోక్స్‌ను పోలుస్తూ ఐసీసీ అధికారిక ట్వీట్టర్ ఖాతాలో ఫొటోతో సహా పోస్ట్ చేయడం భారత అభిమానులకు నచ్చలేదు. సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని.. బెన్ స్టోక్స్ కు అంత సీన్ లేదంటూ విమర్శిస్తున్నారు. ఐసీపీ ఇప్పటికే చాలా అతి నిర్ణయాలతో పరువు పోగొట్టుకుందని… ఇకపై అయినా నిబంధనల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని క్రికెట్‌పై ఉన్న గౌరవం కాపాడుకునేలా చేయాలని సూచిస్తున్నారు.
The greatest cricketer of all time – and Sachin Tendulkar 😉#CWC19Final pic.twitter.com/fQBmfrJoCJ
— Cricket World Cup (@cricketworldcup) July 14, 2019