ఇస్మార్ట్ శంకర్.. పెద్దలకు మాత్రమే అంటోన్న బ్యూటీ!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందా అని సినీ జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ‘ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. పూర్తిగా మాస్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకు అడల్ట్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపారు. కాగా ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం చాలా మంచిదని చిత్ర యూనిట్ అన్నారు. గతంలో పూరీ డైరెక్ట్ చేసిన దేశముదురు, పోకిరి, బిజినెస్‌మెన్‌ చిత్రాలకు కూడా ఏ సర్టిఫికెట్ వచ్చిందని.. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా అదే కోవలోకి రావడం సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత ఛార్మీ అంటోంది.

అయితే సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. రామ్ సరికొత్త మాస్ అవతార్‌లో నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 18న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment