తెలుగు ప్రజలకు డబ్బింగ్ చిత్రాలతో పరిచయం అయిన విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిచ్చగాడు సినిమాకు ముందు వరకు దక్షిణాదిలో ఓ సంగీత దర్శకుడిగా మాత్రమే సినిమా ప్రేక్షకులకు పరిచయం అయిన విజయ్ బిచ్చగాడు తర్వాత ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఐవి.శశి దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు తెలుగులో హిట్ అయింది. తెలుగులో ఈ సినిమా ఏకంగా 55 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అప్పటివరకు ఉన్న ఇమేజ్‌ను బిచ్చగాడు పూర్తిగా మార్చేసింది. బిచ్చగాడు తర్వాత వచ్చిన అతని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు.
బిచ్చగాడు తర్వాత వరుసపెట్టి డిజాస్టర్ సినిమాలు చేసిన విజయ్ ఎట్టకేలకు తన తాజా సినిమా కిల్లర్ తో మళ్లీ హిట్ ట్రాక్లోకి వచ్చాడు. విజయ్.. సీనియర్ హీరో అర్జున్ కాంబినేషన్లో వచ్చిన కిల్లర్ సినిమా తెలుగులో మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రమోషన్లు కాస్త వీక్‌గా ఉండడంతో కలెక్షన్లు తక్కువగా ఉన్నా… విమర్శకులు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.
ఇదిలా ఉంటే తనకు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చాలా కష్టమని… తన సినిమాల్లో ముందు నుంచి తెర మీద ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసే విషయంలో వీక్ గా ఉంటా అన్న విమర్శలు ఉన్నాయని… అది కాస్త కిల్లర్ సినిమాతో పోయిందని విజయ్ చెప్పాడు. కిల్లర్ సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగా పండటానికి హీరోయిన్ అషిమా నర్వాల్ కారణమని విజయ్ చెప్పాడు. ఏదేమైనా రొమాన్స్ విషయంలో అషిమా కోపరేషన్ విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషమే.
రొమాన్స్‌కు ఆ హీరోయిన్ బాగా కోపరేట్ చేస్తోందంటోన్న హీరో..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి