ఆ హీరోయిన్ కోసం రిస్క్ చేస్తున్న తారక్.. షాక్‌లో ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం RRR చిత్ర షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమాలో తారక్ స్వాతంత్ర సమరయోధుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు చాలా కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా తారక్‌ను ఇంత లాంగ్ గ్యాప్‌ తరువాతే చూస్తామని ఫిక్స్ అయిన ఫ్యాన్స్‌కు తారక్ ఓ షాక్ ఇవ్వబోతున్నాడు.

మహానటి చిత్రంతో భారీ ఇమేజ్‌ సాధించిన కీర్తి సురేష్.. ఇప్పుడు వరుసబెట్టి సెలెక్టివ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కాగా ఈ బ్యూటీ ఇప్పుడు మెయిన్ పాత్రల్లో నటిస్తూ కూడా సినిమాలు చేస్తోంద. ఈ క్రమంలో కీర్తి సురేష్ నటించబోయే సఖి చిత్రంలో తారక్ ఓ కెమియో రోల్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ చేయబోయేది ఓ అదిరిపోయే పాత్ర అని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఈ విషయంపై తారక్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా తారక్ కెమియో దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. అయితే తారక్‌ RRR లుక్‌ కంటే ముందు రివీల్ అయితే ఎలా అని తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా తారక్ కేమియో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Leave a comment