గత కొద్దిరోజులుగా సౌత్ ఇండియా మీడియాలో ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి కోకొల్లలుగా కథనాలు వస్తున్నాయి. మీటు ఉద్యమంలో భాగంగా చిన్మయి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ బాధితుల పక్షాన పోరాటం చేసింది. మీటు ఉద్యమంలో చిన్మయి ఎంతో మంది స్టార్స్, సెలబ్రిటీలపై చేయడంతో ఆమెకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. స్త్రీ వాదం అంటూ ఆమె చేసిన హడావుడి చూసిన చాలా మంది మహిళలు ఆమెకు సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచారు.
అయితే తాజాగా చిన్మయి తన భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన మన్మధుడు 2 టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యడంతో తీవ్ర విమర్శలకు గురవుతోంది. నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న మన్మధుడు 2 సినిమాకు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్న ఆ టీజర్లో రొమాన్స్ శృతిమించి పోయింది అన్న టాక్ వచ్చింది.
మరి ఇలాంటి వీడియోలను ఎలా షేర్ చేస్తుందని…. మాటమాటకు స్త్రీవాదం అని చెప్పే ఆమెకు ఇది తగునా అన్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చిన్మయిపై వస్తున్న విమర్శలకు కౌంటర్‌గా రంగంలోకి దిగిన రాహుల్ రవీంద్రన్ ఉమెన్స్ మేకింగ్ లవ్ సీన్స్ చేస్తే ఎలా విమర్శిస్తారని, తాము ఇప్పుడు ఏంటి సెక్స్ ఫీలింగ్స్ కలిగించే మన దేశంలో 1.4 బిలియన్ టైమ్స్ సెక్స్ గురించి ఆలోచిస్తారని, ఎవరు ? బయటకు తమ ఫీలింగ్స్ వ్యక్తపరచరని … ఇలాంటివారిని కపటవేషధారి అంటారని కూడా రాహుల్ తీవ్రంగా స్పందించాడు.
మన్మధుడు 2 చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టైటిల్‌కు తగ్గట్లుగా సినిమా ఉంటుందనిపించడంతో పాటు నాగార్జున లుక్ చాలా బాగుందన్న టాక్ దక్కింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన్మధుడు 2 చిత్రంతో దర్శకుడిగా రాహుల్ రవీంద్ర మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటాడేమో ? చూడాలి.