ఇది కూడా పోయిందంటే.. ఇక అంతే!

ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు యంగ్ హీరో కార్తికేయ. Rx100 సినిమాతో మనోడు యూత్‌లో సాధించిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో మనోడు కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడనే టాక్ వినిపించింది. ఇది కాస్త నిజం చేశాడు మనోడు తన నెక్ట్స్ మూవీతో. హిప్పీ అనే సినిమాతో మనోడు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడో ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూశారు.

RX100 సినిమా కేవలం తనవల్లే నడిచిందని అనుకున్న హీరోగారికి దిమ్మతిరిగే షాకిచ్చారు ఆడియెన్స్. తలాతోక లేని కథతో హిప్పీ చిత్రం తీుకువచ్చి.. కేవలం అడల్ట్ కంటెంట్‌తో మరో హిట్ కొట్టొచ్చనే భ్రమలో బతికిన కార్తికేయకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశారు ఆడియెన్స్. సినిమాను కనీసం వారం కూడా థియేటర్లలో నడవకముందే ఎత్తేశారు. దీంతో తేరుకున్న హీరో వెంటనే గుణ 369 అంటూ తన నెక్ట్స్ మూవీని రెడీ చేశాడు. అయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా హిట్ అయితేనే మనోడు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం ఉందని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

కాగా ఈ సినిమా తరువాత కూడా మనోడు రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు. ఏదేమైనా గుణ 369 హిట్ కాకపోతే ఇక బిచానా ఎత్తే హీరోల్లో కార్తికేయ చేరడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమా మనోడికి లైఫ్ ఇస్తుందో లేదో చూడాలి అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment