భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ పరుగుల యంత్రంలా మారిపోయాడు. కోహ్లీని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు కూడా ఎంతో ప్రశంసిస్తున్నారు. చేజింగ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడంటే భారత్‌కు ఘనవిజయం అన్న నానుడి బలంగా వచ్చేసింది. చేజింగ్‌లో కోహ్లీ సెంచరీ చేసిన మ్యాచ్‌లలో ఒకటీ ఆరా మినహా అన్ని మ్యాచ్‌లలో టీమిండియా గెలిచింది. భారత క్రికెట్ జట్టులో దిగ్గజ క్రికెటర్ల రికార్డులను సచిన్ టెండుల్కర్ బద్దలు కొడితే… ఆయన రికార్డుల్లో కొన్నింటిని ఇప్పటికే కోహ్లీ దాటేశాడు.
కోహ్లీ ఆడుతున్నాడు అంటే అంతర్జాతీయంగా టాప్ దేశాల బౌలర్లు భయంతోనే బౌలింగ్ చేస్తుంటారు. అలాంటి కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టే ఆటగాడు ఉండడు అని కూడా చాలా మంది నిన్నటి వరకు చెప్పారు. అయితే ఇప్పుడు మన దాయాది దేశంలోనే కోహ్లీకే సవాల్ విసిరే ఆటగాడు వచ్చేశాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్.
కోహ్లీ సాధించిన ప్రతి రికార్డును బాబర్ అంతకంటే తక్కువ టైంలోనో లేదా తక్కువ మ్యాచ్‌ల్లోనే బ్రేక్ చేసేస్తున్నాడు. కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేసేందుకు 24 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే బాబర్ కేవలం 21 మ్యాచ్‌లకే ఈ మార్క్ క్రాస్ చేసేశాడు. 2 వేల పరుగులు చేసేందుకు కోహ్లీకి 53 మ్యాచ్‌లు అవసరం అయితే బాబర్‌కు 45 మ్యాచ్‌లు… కోహ్లీ కంటే 8 మ్యాచ్‌లు తక్కువే అవసరం అయ్యాయి.
ఇక 3 వేల పరుగుల మార్క్ చేరుకునేందుకు కోహ్లీ 75 మ్యాచ్‌లు తీసుకున్నాడు. బాబర్ కేవలం 68 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఇలా ప్రతి ల్యాండ్ మార్క్ రికార్డు బ్రేక్ చేసే విషయంలో బాబర్ కోహ్లీని మించి దూసుకుపోతున్నాడు. బాబర్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో కోహ్లీ రికార్డులకు చెదలు పట్టించి… మరో గొప్ప ప్రపంచస్థాయి ఆటగాడిగా ఎదుగుతాడనడంలో సందేహం లేదు.