Moviesసూర్య NGK రివ్యూ & రేటింగ్

సూర్య NGK రివ్యూ & రేటింగ్

సినిమా: ఎన్‌జీకే
నటీనటులు: సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు
దర్శకుడు: సెల్వ రాఘవన్
నిర్మాత: ఎస్ఆర్ ప్రభు
సంగీతం: యువన్ శంకర్ రాజా

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఎన్‌జీకే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య ఎలాంటి పాత్రలో నటించాడా అని ఆతృతగా ఎదురుచూస్తు్న్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకుల అంచనాలను ఎన్‌జీకే ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
నంద గోపాల కృష్ణ(NGK) ఎంఎన్‌సీలో ఉద్యోగం వదిలేసి రైతుగా జీవనం సాగిస్తుంటాడు. అతడు తన భార్య(సాయి పల్లవి), కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి రాజకీయాలపై ఆసక్తి కలుగుతుంది. దీంతో అతడు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తాడు. రైతుల్లో అతడికి మంచి పేరు ఉండటంతో అతడిని రాజకీయాల్లో అనచివేసేందుకు కొందరు కుట్ర పన్నుతారు. కట్ చేస్తే.. సూర్యపై హత్యాయత్నం జరుగుతుంది. దీంతో రాజకీయ పార్టీలకు పీఆర్‌గా పనిచేసే వనిత(రకుల్ ప్రీత్ సింగ్) సలహాలతో అతడు రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి..? సూర్య రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటాడు..? అతడి ప్రత్యర్థులు ఎవరు..? చివరకు సూర్య ఏమౌతాడు..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌‌లో సూర్య రాజకీయంగా ఎదగాలని చూస్తుంటాడు. రైతుల సమస్యలపై పోరాడే యువకుడిగా సూర్య పాత్ర చాలా బాగుంది. అయితే రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని సూర్య రాజకీయాల్లో అడుగుపెడతాడు. అయితే ఈ క్రమంలో అతడు చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. ఓ కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసిన సూర్య పలు ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఒక చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

సెకండాఫ్‌లో సూర్యపై హత్యాయత్నం జరుగుతుంది. దీంతో అతడు పవర్‌ఫుల్ రాజకీయ నేతగా ఎదిగే విధానం ఆడియెన్స్‌కు కాస్త కనెక్ట్ అవుతుంది. ఈ క్రమంలో కొన్ని సీన్స్ ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. తలపొగరు బాగా ఉన్న పీఆర్‌ వనితగా రకుల్ నటన బాగుంది. సూర్య పొలిటికల్ గ్రోత్‌కు వనిత ఇచ్చే సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. ఈ క్రమంలో అతడి ప్రత్యర్థుల సవాళ్లను ఎదుర్కొని చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారుతాడు సూర్య. రైతుల కోసం అతడు చేపట్టే పథకాలతో సినిమా ముగుస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే.. ఎన్‌జీకే ఓ పూర్తిస్థాయి పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమా. ఈ సినిమా ద్వారా దర్శకుడు తాను చెప్పాలనుకున్న అసలు విషయాన్ని చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమాలో బోరింగ్ సీన్స్ చాలా ఉండేసరికి ఆడియెన్స్‌కు బాగా విసుగొస్తుంది.

నటీనటుల ప్రతిభ:
నంద గోపాల కృష్ణగా సూర్య అద్భుతంగా నటించాడు. అయితే ఈ సినిమాను సూర్య ఎందుకు ఒప్పుకున్నాడో ఆయనకు తెలియాలి. పర్ఫార్మెన్స్‌తో సినిమాను క్యారీ చేయలేమనే విషయాన్ని సూర్య మరోసారి మరచిపోయాడు. అటు సూర్య భార్యగా సాయి పల్లవి ఒక ప్రాముఖ్యత లేని పాత్రలో నటించింది. ఈ సినిమా ఎవరికైనా ఉపయోగపడిందంటే.. అది ఖచ్చితంగా రకుల్‌కే. తలపొగరు బాగా ఉన్న ఓ పీఆర్‌గా రకుల్ పర్ఫార్మెన్స్ బాగుంది. మిగతా నటీనటులు చాలా మందే ఉన్నా పెద్ద ఉపయోగం లేదు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఎన్‌జీకే సినిమాతో దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడో ఆయనకే తెలియాలి. ఇప్పటికే ఇలాంటి సినిమాలో బోలెడు ఉన్నా.. దర్శకుడు మళ్లీ అదే ఫార్మాట్‌తో రావడం ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. రైతుల కోసం ఏదో చేయాలనే హీరో.. చివరకు రాజకీయ నాయకుడిగా మారుతాడు. చిన్న స్టోరీలైన్‌తో రెండున్నర గంటలకు ఆడియెన్స్‌తో చెడుగుడు ఆడుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక సినిమాకు సంగీతం కూడా పెద్దగా చేసిందేమి లేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.

చివరగా:
ఎన్‌జీకే.. రొటీన్ కొట్టుడు!

రేటింగ్: 2.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news