సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మరికొన్ని గంటల్లో థియేటరల్లలో దిగిపోతాడు. ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఒక రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్. కాగా ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో అదే స్థాయి అంచనాల మధ్య రిలీజ్ కానుంది. అయితే దుబాయ్ లాంటి దేశంలో అందరికంటే ముందే షోలుపడుతుంటాయి. దీంతో అక్కడి సినీ క్రిటిక్ ఈ చిత్ర ఫస్ట్ రివ్యూను అప్పుడే తన ట్విట్టర్ ఖాతాలో రివీల్ చేసేశాడు.
దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యులు ఒమర్ సంధు ఎప్పటిలాగే మరోసారి మహేష్ బాబు మహర్షి సినిమా రివ్యూను రివీల్ చేసేశాడు. దుబాయ్ సెన్సార్ సభ్యులతో కలిసి చిత్రాన్ని చూసిన ఒమర్ సంధు మహర్షి సినిమాకు నాలుగు రేటింగ్ ఇచ్చాడు. మహేష్ కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం ఇదే అంటూ కితాబిచ్చాడు ఒమర్. కాగా ఈ సినిమా చూసిన అందరూ ఎమోషన్ కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఫస్టాఫ్ మొత్తం మహేష్ కామెడీ టైంమింగ్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇక సెకండాఫ్‌లో ఆడియెన్స్‌ను కన్నీరు పెట్టించడం ఖాయమని ఆయన తెలిపారు.
ఓవరాల్‌గా మహర్షి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఎమోషనల్ మూవీ అని ఆయన కితాబిచ్చాడు. అయితే ఒమర్ సంధు దాదాపు అన్ని సినిమాలకు ఇదే తరహా రివ్యూ ఇవ్వడం సాధారణం. గతంలోనూ అతడు ఇచ్చిన రివ్యూలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపగా.. మరికొన్ని ఫ్లాప్ మూవీలుగా మిగిలాయి. ఏదేమైనా ఈ రివ్యూతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బొమ్మ బాక్సాఫీస్‌ను బెంబేలెత్తించడం పక్కా అంటూ కాలర్ ఎగరేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.