మహేష్‌కు ఎసరు పెట్టిన డైరెక్టర్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష బాబు ప్రస్తుతం వరుస బెట్టి సినిమాలు చేయకుండా చాలా సెలెక్టివ్‌గా తనకు సూట్ అయ్యే పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే భరత్ అనే నేనుతో బ్లాక్‌బస్టర్ అందుకున్న మహేష్, ఇప్పుడు మహర్షి సినిమాతో మనముందుకు రానున్నాడు. అయితే ఈ లోపే మహేష్‌కు ఎసరు పెట్టాడు ఓ స్టార్ డైరెక్టర్.

రంగస్థలం చిత్రంతో టాలీవుడ్‌ రికార్డులను షేక్ చేసిన దర్శకుడు సుకుమార్, తన నెక్ట్స్ మూవీని మహేష్‌తో తెరకెక్కిస్తానంటూ అప్పట్లో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ కథను కూడా రెడీ చేసుకున్నాడు. ఇది స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ కావడంతో తనకు సూట్ కాదని.. రిస్క్ చేయడం ఎందుకని అనుకున్న మహేష్.. సుకుమార్‌ను పక్కకు పెట్టాడు. దీంతో సుక్కు అదే కథను తీసుకెళ్లి బన్నీకి వినిపించాడు. కథ నచ్చడంతో బన్నీ వెంటనే ఓకే చెప్పేశాడు. కాగా మహేష్ కోసం ఒక ఎంటర్‌టైనర్‌ కథను రెడీ చేసి వినిపించాడు అనిల్ రావిపూడి. దీంతో మహేష్ అనిల్‌కు ఓకే చెప్పేశాడు.

దీంతో ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. తనను కాదన్న హీరోకు పోటీగా అదే సినిమాను తెరకెక్కించి సుకుమార్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

Leave a comment