ఏ ఇండస్ట్రీ హీరోహీరోయిన్లైనా ఒక స్థాయి రాగానే అనేక ప్రోడక్టలకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. దీని కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌ను సైతం తీసుకుంటారు. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా తమవంతుగా సబ్బులు, షాంపూలు వగైరా యాడ్స్‌ను ప్రమోట్ చేస్తూ కనిపిస్తారు. ఇక ఈ ట్రెండ్ బాలీవుడ్లో మరో లెవెల్లో ఉంటుంది. ఏం చేశామా అనేది పక్కనబెట్టి ఎన్ని చేశామా అనే స్థాయిలో అక్కడ యాడ్స్ చేస్తుంటారు స్టార్స్. ఇప్పుడు ఇదే విధంగా ఓ యాడ్ చేసిన లోఫర్ బ్యూటీ అభాసుపాలవుతోంది.
తెలుగలో లోఫర్ సినిమాతో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసిన దిషా పటాని అటుపై బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిందంటూ బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే అమ్ముడు ప్రస్తుతం కాల్విన్ క్లెయిన్ అనే ఇన్నర్‌వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగా ఎన్నో హాట్ ఫోటో షూట్లు చేస్తూ ప్రేక్షకుల్లో మంటలు రేపుతోంది. కాగా తాజాగా ఆమె తన చొక్కా బటన్లు విప్పి, ప్యాంట్ జిప్పు విప్పి మరీ ఇన్నర్‌వేర్‌ను ప్రమోట్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో తుక్కు రేగ్గొడుతోంది.
ఎంత అంబాసిడర్‌గా ఉంటే మాత్రం ఇంతలా బరితెగించాలా అని ఆమెను తిట్టిపోస్తున్నారు కొందరు ఫ్యాన్స్. ఇక చూసినోళ్లకు చూసినంత చందానా అమ్మడు ఇలాంటి ఫోటో షూట్లకు నో చెప్పకుండా దూసుకుపోతుంది. ఏదేమైనా అమ్మడి ఫోటోషూట్ బాలీవుడ్ జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది.