200 కేజీల ఐస్ క్యూబ్‌లతో వేడి పుట్టించిన సీత

అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీత’ అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోండగా సక్సెస్‌ఫుల్ దర్శకుడు తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో మంచి చిత్రంగా సీత మిగులుతుందని అమ్మడు చెప్పింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని.. ప్రత్యేకించి ఓ సీన్లో అమ్మడు ఏకంగా 200 కేజీల ఐస్ క్యూబ్‌లతో తన శరీరాన్ని కప్పేసిన సీన్ గురించి గుర్తుకు చేసుకుంది. బాత్‌టబ్బులోని ఈ సీన్ కోసం కాజల్ చాలా టేక్‌లు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాతో బెల్లంకొండ బాబు హిట్ కొట్టడం పక్కా అని అంటోంది కాజల్.

కాగా ఈ సినిమాలో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ఒక కాన్ఫిడెంట్ అమ్మాయిగా నటించినట్లు కాజల్ తెలిపింది. తేజ డైరెక్షన్‌లో నటించడం తనకు బాగా ఇష్టమని కాజల్ పొగిడింది. మరి 200 కేజీ ఐస్‌ క్యూబ్లతో కాజల్ చేసిన సీన్ ఏమిటా అని ఆమె ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment