గల్లీ బోయ్ విజయ్ దేవరకొండ..!

రణ్ వీర్ సింగ్.. అలియా భట్ లీడ్ రోల్స్ లో జోయా అక్తర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గల్లీ బోయ్. రణ్ వీర్ సక్సెస్ మేనియా కొనసాగిస్తూ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ను షేర్క్ చేసింది. గల్లీ బోయ్ 230 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ కొట్టడంతో తెలుగులో రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గల్లీ బోయ్ రీమేక్ చేస్తారని తెలుస్తుంది. అయితే ముందు ఈ సినిమా రీమేక్ లో సాయి తేజ్ నటిస్తాడని అన్నారు.

కాని ఇప్పుడు ఆ ఛాన్స్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అందుకున్నాడని తెలుస్తుంది. యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ అయితేనే ఈ సినిమాకు పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట. గల్లీ బోయ్ గా విజయ్ మరోసారి తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు ఎప్పుడు మొదలవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది.

ఆ తర్వాత ఆనంద్ అన్నామలై కూడా లైన్ లో ఉంది. మరో పక్క మజిలీ డైరక్టర్ విజయ్ కు కథ సిద్ధమని చెప్పాడు. ఇవన్ని కాక గల్లీ బోయ్ రీమేక్ కూడా విజయ్ చేస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమాలన్ని చేయాలంటే విజయ్ రెండేళ్లు కష్టపడాల్సిందే. డియర్ కామ్రేడ్ మూవీ మే 31న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ సినిమా టైంలోనే సూర్య ఎన్.జి.కే రిలీజ్ అవుతుంది.

Leave a comment