బిజినెస్ అదరగొట్టిన జెర్సీ.. నాని స్టామినా ఇది..!

నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న జెర్సీ సినిమా రేపు అనగా ఏప్రిల్ 19 శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈరోజు నైటే యూఎస్ లో ప్రీమియర్స్ షోస్ పడనున్నాయి. నాని క్రికెటర్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

ఇక నాని సత్తా చాటుతూ జెర్సీ సినిమా 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో నిరాశపరచిన నాని జెర్సీతో హిట్టు కొట్టడం పక్కా అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాన్ ఫిడెంట్ గా చెప్పాడు. ఇక ఏరియాల వారిగా నాని జెర్సీ బిజినెస్ డీటైల్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 10 .00 కోట్లు
సీడెడ్ : 3.20 కోట్లు
ఈస్ట్ : 1.60 కోట్లు
కృష్ణ : 1.45 కోట్లు
గుంటూరు : 1.80 కోట్లు
వెస్ట్ : 1.25 కోట్లు
నెల్లూరు : 0.80 కోట్లు
ఏపీ/తెలంగాణ : 20.10 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.90 కోట్లు

ఓవర్సీస్ : 4.00 కోట్లు

వరల్డ్ వైడ్ : 26.00 కోట్లు